Kerala: మహిళల వాష్‌రూంలో సీక్రెట్‌ కెమెరా.. కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో బయటపడ్డ ఉదంతం..

|

Nov 11, 2021 | 6:14 PM

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ట్రయల్‌ రూంలో మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు ఫొటోలు తీసిన సంఘటన సంచలనం..

Kerala: మహిళల వాష్‌రూంలో సీక్రెట్‌ కెమెరా.. కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో బయటపడ్డ ఉదంతం..
Follow us on

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ట్రయల్‌ రూంలో మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు ఫొటోలు తీసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నగరంలోని ఓ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారనే విషయం కలకలం రేపింది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. అక్కడి దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల వాష్‌రూంలో రహస్యంగా అమర్చిన సీక్రెట్‌ కెమెరాను ఓ మహిళ గుర్తించింది. దూరదర్శన్‌ కేంద్రంలోని ప్రధాన స్టూడియోకు సమీపంలోని బాత్రూంలో ఈ సీక్రెట్‌ కెమెరాను అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న దూరదర్శన్‌ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

అంతర్గత విచారణలో..
ఈ క్రమంలో తిరువనంతపురం సైబర్‌ సెల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా సలహా కమిటీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరపగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దూరదర్శన్‌ కార్యాలయంలో ఇటీవల తాత్కాలిక పద్ధతిలో నియమితుడైన ఓ ఉద్యోగి ఈ రహస్య కెమెరాను అమర్చినట్లు విచారణలో తెలిసింది. బాత్రూంలోని కెమెరాను వెంటనే తీసేయడంతో సదరు ఉద్యోగిని విధుల్లోంచి తొలగించినట్లు విచారణాధికారులు వెల్లడించారు.

Also Read:

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..

Hyderabad: పైకి అందమైన ఫోటో ప్రేమ్స్.. లోపల చీకటి బాగోతం.. పోలీసులు స్టన్

Road Accident: ఛత్‌పూజ చేసుకొని ఇంటికి వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం