కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వసతి గృహంలో ఉంటూ భాగ్యలక్ష్మి మూడో సీఎస్సీ చదువుతోంది. గర్ల్స్ హాస్టల్‌లో మూడో అంతస్తులోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. స్నేహితులు, సిబ్బంది పరిశీలించేసరికే విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. కాగా ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. చనిపోవడానికి ముందు ఆమె ఓ అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టు సమాచారం.