డైట్ విద్యార్థుల్ని ఆదుకోండి.. జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2018 - 2020 కి సంబంధించి డైట్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేందుకు..

డైట్ విద్యార్థుల్ని ఆదుకోండి.. జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ
Follow us

|

Updated on: Sep 15, 2020 | 7:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2018 – 2020 కి సంబంధించి డైట్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేందుకు చర్యలు చేపట్టండని ఆలేఖలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 531 డైట్ కళాశాలల్లో 35 వేల మంది విద్యార్థులు మేనేజ్ మెంట్ కోటా కింద చేరారని.. ఒక్కో విద్యార్థి రు.50 వేల నుండి లక్ష రూపాయల వరకు కళాశాల యాజమాన్యాలకు ఫీజులు కట్టడం జరిగిందని సీఎంకు విన్నవించారు. ఈనెల 28 నుండి నిర్వహించే పరీక్షలు కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తామనటంతో మేనేజ్ మెంట్ కోటా కింద కళాశాలల్లో చేరి విద్యాసంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు అగమ్యగోచరంలో పడ్డారని రామకృష్ణ వివరించారు. మేనేజ్ మెంట్ కోటా కింద విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు నష్టపోకుండా రెగ్యులర్ విద్యార్థులతో కలిసి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఆయన సీఎంకు రాసిన లేఖలో అభ్యర్థించారు.