యాదాద్రిపైకి నడిచే వెళ్లాలి.. ఈ నెల 8 నుంచి దర్శనాలు

| Edited By:

Jun 03, 2020 | 3:06 PM

భక్తుల రాకకోసం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సన్నద్ధమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు ఆర్జిత పూజల నిర్వహణకు కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భక్తులు కాలినడకనే గుట్ట...

యాదాద్రిపైకి నడిచే వెళ్లాలి.. ఈ నెల 8 నుంచి దర్శనాలు
Follow us on

భక్తుల రాకకోసం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సన్నద్ధమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు ఆర్జిత పూజల నిర్వహణకు కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భక్తులు కాలినడకనే గుట్ట మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. గుట్ట పైకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. యాదాద్రిలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆలయ ఈవో గీత ఏర్పాట్లపై సమీక్షించారు. కొండ కింది నుంచిపై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతిక దూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ముందుగా వారం పాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు.

అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 50 జంటలు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక శ్రీవారి కల్యాణానికి 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇస్తామని తెలిపారు. అయితే దర్శనాలకు పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టం చేశారు.

Read More:

సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబ్ బెదిరింపులు..

జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత