లాక్‌డౌన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ షార్ట్ ఫిల్మ్

| Edited By:

Apr 26, 2020 | 2:16 PM

లాక్‌డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పలు రకాల ఛాలెంజ్‌‌లు, వంటలు చేస్తూ సోషల్ మీడియాల్లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను చేసే పనులపై ఓ షార్ట్ ఫిల్మ్..

లాక్‌డౌన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ షార్ట్ ఫిల్మ్
Follow us on

లాక్‌డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పలు రకాల ఛాలెంజ్‌‌లు, వంటలు చేస్తూ సోషల్ మీడియాల్లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను చేసే పనులపై ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ అందరికీ బోర్ కొడుతుంది. ఇలాంటి విషయాన్నే ఓ షార్ట్ ఫిల్మ్‌గా తీస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచన రావడమే లేట్.. వెంటనే షార్ట్ ఫిల్మ్ చేసేసింది రకుల్.

ఇంతకీ ఈ వీడియోలో రకుల్ ఏం చేసిందంటే.. ‘నిద్ర లేచి.. ఓ కప్పు కాఫీ తాగి, తరువాత ఫిట్‌నెస్ కోసం యోగాసనాలు వేస్తుంది, ఆ తరువాత బ్రెడ్‌పై జామ్ రాసి.. పుస్తకాలు చదివేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో వీడియో కాల్ మాట్లాడి ఆ తరువాత టీవీ చూస్తుంది. ఇంతలో నిద్ర వచ్చి టీవీ ఆఫ్ చేస్తుంది’. రోజూ ఇలానే తన రోజువారి సంగతులను చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!