Covid-19 vaccine: ముమ్మరంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 19.84 కోట్ల డోసుల పంపిణీ

|

May 25, 2021 | 8:14 AM

India Covid-19 vaccination: దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా

Covid-19 vaccine: ముమ్మరంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 19.84 కోట్ల డోసుల పంపిణీ
Coronavirus Vaccination
Follow us on

India Covid-19 vaccination: దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల టీకాల కొరత వేధిస్తున్నప్పటికీ.. కేంద్రం పలు చర్యలు తీసుకోని వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందిస్తోంది. కాగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. 18-44 మధ్య వయస్సున్న 12,52,320 మందికి సోమవారం మొదటి డోసు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,18,81,337 మందికి మొదటి డోసు అందజేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే.. బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 10 లక్షలకుపైగా డోసులు వేశారని వివరించింది. టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 129వ రోజు చేరగా.. ఒకే రోజు 23,65,395 వ్యాక్సిన్‌ డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 21,90,849 మందికి మొదటి డోసు ఇవ్వగా.. 1,74,546 మందికి రెండో డోసు అందజేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొంత ఉపశమనం కలిగించే విషమేంటంటే.. ఇటీవల నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు కాస్త.. రెండు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. కాగా.. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

Fungal Infections: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లన్నీ ఒకటికాదు.. వాటికి రంగులేమిటి..? ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా..

Covid-19 vaccination: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై కరోనా వ్యాక్సినేషన్‌కు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్.. కానీ..