India Corona Cases: దేశంలో కొత్తగా 18,139 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

|

Jan 08, 2021 | 11:09 AM

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతుంది. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం.  కోలుకుంటున్నవారి సంఖ్య ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. కొత్తగా దేశవ్యాప్తంగా...

India Corona Cases: దేశంలో కొత్తగా 18,139 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
Corona-Virus-India
Follow us on

India Corona Cases:  దేశంలో కరోనా తీవ్రత తగ్గుతుంది. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం.  కోలుకుంటున్నవారి సంఖ్య ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. కొత్తగా దేశవ్యాప్తంగా  9,35,369 మందికి కరోనా టెస్టులు చేయగా.. 18,139 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,04,13,417 కి చేరింది.  మరో 234మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఫలితంగా ఈ మహమ్మారి కారణంగా  1,50,570 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా  20,539మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,00,37,39కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,25,449 యాక్టీవ్ కేసులున్నాయి.  ఇండియాలో యాక్టీవ్ కేసుల రేటు 2.16 శాతానికి తగ్గగా..రికవరీ రేటు 96.39శాతానికి పెరిగింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Also Read :

APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు