సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

| Edited By:

Mar 25, 2020 | 12:00 PM

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు. టీడీఎల్పీ సభ్యులతో ఆన్‌లైన్ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధకానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం..

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు
Follow us on

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వ్యక్తిగతంగా తన వంతు కుటుంబం నుంచి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. టీడీఎల్పీ సభ్యులతో ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా ప్రబలుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధకానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమ వంతుగా ప్రభుత్వాలకు సహకరించాలన్నారు చంద్రబాబు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావలని ఆయన కోరారు. కాగా.. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తమ వంతుగా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించారు.

కాగా.. ప్రజలు కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు చంద్రబాబు. అలాగే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, రోడ్లపైకి ఎవరూ రావొద్దని సూచించారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ని ఎలా పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ అలాగే ఇళ్లలోనే ఉండాలన్నారు మాజీ సీఎం చంద్రబాబు.

ఇవి కూడా చదవండి:

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?