ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టుకు రూ. 2400లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజ‌కూ పెరిగిపోతున్న‌కేసుల సంఖ్య చూస్తుంటే హ‌స్తిన‌వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వైర‌స్ టెస్టుల్లో వేగం పెంచేందుకు ఢిల్లీ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటుగా ప్రైవేటు ఆస్ప‌త్రుల్లోనూ..

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టుకు రూ. 2400లు
Follow us

|

Updated on: Jun 18, 2020 | 6:47 PM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజ‌కూ పెరిగిపోతున్న‌కేసుల సంఖ్య చూస్తుంటే హ‌స్తిన‌వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వైర‌స్ టెస్టుల్లో వేగం పెంచేందుకు ఢిల్లీ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటుగా ప్రైవేటు ఆస్ప‌త్రుల్లోనూ టెస్టులు చేసేందుకు ఇప్ప‌టికే అనుమ‌తులు జారీ చేసింది. ఈ మేర‌కు ప్రైవేటులో క‌రోనా టెస్టుల‌కు చెల్లించాల్సిన రుసుమును ప్ర‌భుత్వం నిర్ధేశించింది.
ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో  క‌రోనా టెస్టుకు రూ. 2400గా నిర్ణ‌యించిన‌ట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. క‌రోనా  ఆర్టీపీసీఆర్ (రివ‌ర్స్ ట్రాన్స్‌క్రిప్ష‌న్‌పాలిమ‌రేస్ చైన్ రియాక్ష‌న్‌) ప‌రీక్ష‌కు అన్ఇన చార్జీల‌తో క‌లిపి రూ. 2400గా నిర్ణ‌యించాల‌ని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించిన‌ట్లుగా పేర్కొన్నారు.