రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?

| Edited By:

May 17, 2020 | 3:23 PM

కరోనా వైరస్ విజృంభణతో.. దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను..

రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?
Follow us on

కరోనా వైరస్ విజృంభణతో.. దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు ఐదు రోజుల పాటు పూర్తిగా వెల్లడించారు. మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించారో ఆమె తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యానికి ఇందులో పెద్ద పీట వేశారు. చివరగా ప్యాకేజీ మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత కేటాయించారో వివరించారు నిర్మల. ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు.

ఆర్బీఐ ఉద్దీపణ ప్యాకేజ్ – రూ.8.01 లక్షల కోట్లు
మార్చిలో కేంద్రం ప్యాకేజ్ – రూ. 1.92 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 1.0 – రూ. 5.94 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 2.0 – రూ. 3.10 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 3.0 – రూ. 1.50 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 4.0 & 5.0 – రూ. 48,100 కోట్లు
మొత్తం ప్యాకేజ్ – రూ.20 లక్షల కోట్లు

రంగం                                                             కేటాయింపు(కోట్లలో)

1 ఎంఎస్ఎంఈల నిర్వహణ మూలధనం రూ.3,00,000
2 రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలు రూ.20,000
3 ఎంఎస్ఎంఈల ఫండ్​ ఆఫ్​ ఫండ్​ రూ.50,000
4 ఈపీఎఫ్‌ మద్దతు చర్యలు రూ.2,800
5 ఈపీఎఫ్​ రేట్ల తగ్గింపు రూ.6,750
6 ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలు రూ.30,000
7 ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు పాక్షిక రుణ హమీలు రూ.45,000
8 విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆర్థిక సాయం రూ.90,000
9 టీడీఎస్, టీసీఎస్‌ రేట్ల తగ్గింపు రూ.50,000
10 వలస కూలీలకు 2 నెలల ఉచిత రేషన్ రూ.3,500
11 ముద్రా యోజన శిశు రుణాల వడ్డీ రేట్ల సబ్సిడీ రూ.1,500
12 వీధి వ్యాపారులు రూ.5,000
13 దిగువ మధ్య తరగతికి చౌక ఇళ్ల పథకం రూ.70,000
14 నాబార్డ్​ ద్వారా అత్యవసర వర్కింగ్​ క్యాపిటల్​ రూ.30,000
15 కేసీసీ ద్వారా అదనపు క్రెడిట్​ రూ.2,00,000
16 మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​ రూ.10,000
17 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రూ.20,000
18 టాప్​ టు టోటల్​ (ఆపరేషన్​ గ్రీన్స్​) రూ.500
19 వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి రూ.1,00,000
20 పశు సంవర్థక మౌలిక వసతుల కల్పన రూ.15,000
21 ఔషధ మొక్కల పెంపకం రూ.4,000
22 తేనెటీగల పెంపకం రూ.500
23 వయబిలిటీ గ్యాప్​ ఫండింగ్ రూ.8,100
24 గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40,000

Read More:

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన..!