యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..

| Edited By:

Apr 18, 2020 | 8:40 AM

ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌కి మందు లేదు కాబట్టి.. మన శరీరంలో ఉండే యాంటీబాడీస్‌‌ అంటే వ్యాధి నిరోధక శక్తి మూలాలే మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడుతాయని అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా కరోనా నయమైన వారి బాడీ నుంచి యాంటీబాడీస్ సేకరించి..

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..
Follow us on

ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌కి మందు లేదు కాబట్టి.. మన శరీరంలో ఉండే యాంటీబాడీస్‌‌ అంటే వ్యాధి నిరోధక శక్తి మూలాలే మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడుతాయని అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా కరోనా నయమైన వారి బాడీ నుంచి యాంటీబాడీస్ సేకరించి.. మిగతా కరోనా పేషంట్లకు వాటిని ఎక్కిస్తే వారికి కూడా కరోనాను కట్టడి చేయవచ్చని వైద్యులు అభిప్రాయపడుతుంటే.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దీంతో ప్రమాదం ఎక్కువగా ఉందని, ఒకసారి కరోనా సోకి.. నయమైన వారికి మళ్లీ కరోనా సోకదనేందుకు గ్యారెంటీ లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రముఖ ఎమర్జెన్సీస్ నిపుణులు మైక్ ర్యాన్ తెలిపారు.

చాలా మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు.. తమ యాంటీబాడీస్ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఇలా వారి వ్యాధి నిరోధక శక్తి మూలాల్ని కరోనా పేషెంట్లకు ఎక్కించడం వల్ల కలుగుతున్న ప్రయోజనం చాలా తక్కువగానే ఉందని ర్యాన్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ పోవడానికి పరిష్కారం కాదని అన్నారు. ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే.. కరోనాకి వ్యాక్సిన్ మాత్రమే సరైన పరిష్కారమని భావించాల్సి వస్తుంది.

Read More:

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

లాక్‌డౌన్: నడి రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్