కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

| Edited By:

Mar 25, 2020 | 10:09 AM

కరోనా ఎఫెక్ట్‌తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్‌డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి కరోనా వైరస్ ఎంత భయంకరమైన వ్యాధో. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్‌డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.  దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావడానికి ఛాన్స్ లేదు. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే బయటకు రావాలని పేర్కొన్నారు. అలాగే నిత్యవసర సరుకులు కూడా నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.

కాగా.. ఇప్పుడు ఈ వైరస్ ఎఫెక్ట్‌తో అటు తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే ఆర్మీని దించే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ప్రజలు వినకుండా.. రోడ్ల మీద తిరిగితే.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇస్తానన్నారు. కరోనా భయంతో చాలా గ్రామాలు స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ పంచాయతీ సర్పంచ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ పరిధిలో నివసిస్తున్న వారి దగ్గరకు బంధువులు, స్నేహితులు ఇతరులెవరూ రాకూడదని, ఎవరైనా కొత్తగా వస్తే.. ఆ ఇంటి యజమానికి రూ.1000ల జరిమానా విధిస్తామని ఆ గ్రామ సర్పంచ్ ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే