జూన్ 8న చిలుకూరు ఆలయం తెరవడం లేదు: ప్రధాన అర్చకులు రంగరాజన్

| Edited By:

Jun 01, 2020 | 2:35 PM

చిలుకూరు బాలాజీ ఆలయం అప్పుడే తెరవడం లేదని అన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా ఆలయాలు కూడా తెరవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో జూన్ 8వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో..

జూన్ 8న చిలుకూరు ఆలయం తెరవడం లేదు: ప్రధాన అర్చకులు రంగరాజన్
Follow us on

చిలుకూరు బాలాజీ ఆలయం అప్పుడే తెరవడం లేదని అన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా ఆలయాలు కూడా తెరవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో జూన్ 8వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఆలయాలు కూడా తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను దశలవారీగా పూర్తి చేస్తున్నారు. జూన్ 8 నాటికి కొన్ని ఆంక్షలతో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. అయితే ఫేస్ మాస్కులు, ధరించడం, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు అధికారులు.

అయితే జూన్ 8న చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం తెరుచుకోవడం లేదని పేర్కొన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. ఆలయం తెరుచుకోవడం వలన.. ఒక్కసారిగా భక్తులు గుంపులుగా వస్తారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందులోనూ చిలుకూరు బాలాజీ ఆలయం బాగా ఫేమస్. దీంతో భక్తులు ఆలయానికి అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే జూన్ 8న ఆలయం తెరవడం లేదని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి:

బ్రేకింగ్: రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!