Corona Vaccination: 12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు..

కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. మన దేశంలో కూడా మరోసారి కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో వర్షాకాలం ఆరంభంతో

Corona Vaccination: 12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు..
Coronavirus Vaccine For Chi

Updated on: Jul 09, 2022 | 9:30 AM

Corona Vaccination:  బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ టీకాలను 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు ‘ఎన్‌టాగి’ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. కొర్బెవ్యాక్స్‌ను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేయనుండగా, కొవాగ్జిన్‌ టీకా 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు ఉద్దేశించినది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.

కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. మన దేశంలో కూడా మరోసారి కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో వర్షాకాలం ఆరంభంతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్ర‌జ‌లుల భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కోవిడ్‌ వ్యాక్సిన్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us