Covid-19 : కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య..! అధికంగా స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతోందంటే..?

|

Jul 06, 2021 | 6:03 AM

Covid-19 : ప్రస్తుతం దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ప్రతి నగరంలో, ప్రతి వీధిలో వందలాది మంది రోగులు ఉంటున్నారు. ప్రతిరోజూ పడకలు,

Covid-19 : కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య..! అధికంగా స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతోందంటే..?
Covid Variant
Follow us on

Covid-19 : ప్రస్తుతం దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ప్రతి నగరంలో, ప్రతి వీధిలో వందలాది మంది రోగులు ఉంటున్నారు. ప్రతిరోజూ పడకలు, ఆక్సిజన్ కొరత గురించి వింటూనే ఉన్నాం. కానీ 80 శాతం కంటే ఎక్కువ మంది రోగులు ఇంటి వద్దే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించవలసిన అవసరం లేదంటున్నారు. దేశంలో క్రమంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతూ, యాక్టివ్‌ కేసుల సంఖ్య దిగి వస్తోంది. కొవిడ్‌ రోగులు కోలుకుంటున్నారు. కానీ మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి.

చికిత్సలో స్టెరాయిడ్లు వాడకం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇతర సమస్యలు ఉన్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. కోలుకున్న వారిలో కొంతమంది మధుమేహం బారిన కూడా పడ్డారు. ఇప్పుడు ఈ బాధలకు తోడు మరొకటి అదనంగా వచ్చి చేరింది. కొత్తగా ఎవాస్య్కులర్‌ నెక్రోసిస్‌(ఏవీఎన్‌) లేదా ఆస్టియో నెక్రోసిస్‌ అనే సమస్యను గుర్తించారు. దీనినే బోన్‌డెత్‌ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డవారి ఎముకల్లోకి రక్తం సరఫరా తగ్గిపోయి, అది కరగడం ప్రారంభమవుతుంది. రికవరీ దశలో గ్యాస్ట్రో-పేగు వ్యవస్థపై నష్టాన్ని కలిగిస్తున్నాయి.

ఈ సమస్యతో బాధపడుతున్న ముగ్గురు బాధితులకు ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ‘‘ఈ సమస్యతో బాధపడేవారి ఫీమర్‌(తొడ ఎముక)లో నొప్పి కనిపించింది. కొవిడ్‌ రోగులకు అధికంగా స్టెరాయిడ్లను ఇవ్వడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోంది. వెంటనే వైద్యులు రోగాన్ని పసిగట్టి చికిత్స అందించడం ప్రారంభించారు ’’ అని హిందుజా ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ తెలియజేశారు.

ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉంటున్నాయి. కోవిడ్ 19 సంక్రమణలో ఆకలి, వికారం, వాంతులు, విరేచనాలు, ఉదరం నొప్పితో బాధపడిన రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నాక ఉబ్బరం, వాయువు, ఆమ్లత్వం, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తీవ్రత వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. కోవిడ్ -19 చికిత్సలో బహుళ ఔషధ కలయికలు ఉన్నాయి.

Yuga Tulasi: గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం.. గోహత్యలు జరక్కుండా చూడాలని DGPకి వినతిపత్రం

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి