కర్నూలులో క‌రోనా క‌ల్లోలం..82కు పెరిగిన పాజిటివ్ కేసులు

కర్నూలులో క‌రోనా క‌ల్లోలం..82కు పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వణికిస్తోంది. జిల్లాలో వైర‌స్ విజృంభణ కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 82కు చేరింది. పాజిటివ్‌గా తేలిన ఐదుగురు ఢిల్లీ మర్కజ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వచ్చినవారి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఏపీలో […]

Jyothi Gadda

|

Apr 11, 2020 | 10:24 AM

కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వణికిస్తోంది. జిల్లాలో వైర‌స్ విజృంభణ కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 82కు చేరింది. పాజిటివ్‌గా తేలిన ఐదుగురు ఢిల్లీ మర్కజ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వచ్చినవారి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ఏపీలో శుక్రవారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య గుంటూరులో ఏడు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరగా.. కర్నూలు తాజా కేసులతో కలిపి మొత్తం 386కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 10 మంది కోవిడ్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 370 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu