తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలకలం, ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో సోకినవారికి కూడా

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా తీవ్రత తగ్గింది. చాలా స్పల్ప సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలకలం, ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో సోకినవారికి కూడా
Follow us

|

Updated on: Dec 07, 2020 | 4:59 PM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా తీవ్రత తగ్గింది. చాలా స్పల్ప సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు సమర్థవంతమైన మెడిసిన్ కానీ, వ్యాక్సిన్‌ కానీ రానప్పటికీ వైరస్ విజృంభణ తగ్గడంతో అందరూ ఊరట ఫీలవుతున్నారు. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అధిక సంఖ్యలో అధికారులు, సిబ్బంది తాజాగా కరోనా బారినపడ్డారు. నలుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండవసారి కరోనా సోకినట్లు తెలుస్తోంది. గత జూన్ నెలలో కరోనా సోకినవారికి  మరోసారి పాజిటివ్ రావడంతో  ఎస్.ఆర్ నగర్ పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read :

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్

అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే

Latest Articles