నేడు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుఫాను తీవ్రతకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు….

  • Rajeev Rayala
  • Publish Date - 7:30 am, Sat, 28 November 20

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుఫాను తీవ్రతకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.శనివారం ఉదయం 9.45 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు.10 నుంచి 11.30 గంటల వరకు తుఫాను కారణంగా మూడు జిల్లాల్లో జరిగిన భారీ నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా జగన్ పరిశీలించనున్నారు.ఇక నివర్ తుఫాన్ భీభత్సానికి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. బలమైన గాలుల కారణంగా భారీ వృక్షాలు నేల రాలాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు,వంకలు, నదులు పొంగిప్రవహించడంతో లోతట్టుప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలకారణంగా భారీ పంటనష్టం వాటిల్లింది.