క‌రోనా వార్ః రంగంలోకి కేంద్ర‌బృందాలు..నేడు ఏపీ, తెలంగాణ‌కు

దేశంలో 20 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయా జిల్లాలకు కేంద్రం ప్రత్యేక ఆరోగ్య బృందాలను పంపించాలని నిర్ణయించింది.

క‌రోనా వార్ః రంగంలోకి కేంద్ర‌బృందాలు..నేడు ఏపీ, తెలంగాణ‌కు
Follow us

|

Updated on: May 04, 2020 | 7:27 AM

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం… కేంద్ర ప్రజారోగ్య బృందాల్ని పంపింది.  దేశంలో 20 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయా జిల్లాలకు కేంద్రం ప్రత్యేక ఆరోగ్య బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా జిల్లాల్లోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడికి కృషి చేస్తాయి.

రాష్ట్రాలతోపాటూ… కేంద్రానికి చెందిన ప్రజారోగ్య బృందాలు కూడా ఇకపై కరోనా పోరాటంలో… రాష్ట్రాలతో కలిసి పనిచేయబోతున్నాయి. వీటిలో తెలంగాణలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న హైదరాబాద్‌కి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపుతోంది. అలాగే… ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఇదరేసి చొప్పున మూడు బృందాలు వెళ్లనున్నాయి. ఇవాళ ఈ బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకొని… అక్కడి ప్రభుత్వాధికారుల్ని కలవనున్నారు. ఈ బృందాలతో కో-ఆర్డినేషన్ చేసుకుంటూ… రాష్ట్రాల్లో వైద్యాధికారులు… తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. 
కేంద్రం పంపుతున్న హైదరాబాద్‌ టీంలో నెషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి చెందిన డాక్టర్ జయంత్‌దాస్, డాక్టర్ దీపయాన్ బెనర్జీ ఉంటున్నారు. ఈ టీమ్… రాష్ట్ర వైద్య అధికారులకు తగిన సూచనలు చేస్తూ… కరోనా వైర‌స్ విస్త‌రించ‌కుండా చేయ‌డానికి ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కోవిడ్ రిపోర్టులు తెలుసుకుంటూ…అందుకు అనుగుంణంగా ప్ర‌తిచ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఈ మేర‌కు సంబంధింత శాఖ‌ల‌కు  తగిన సలహాలు, సూచనలూ చేస్తుంది. ఇక‌పోతే, ఈ కేంద్ర బృందాలు ఎంతకాలం ఆయా రాష్ట్రాల్లో ఉంటాయో కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. కరోనా కేసులు తగ్గేవరకూ కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాల్లోనే ఉండే అవకాశాలున్నాయి.