బయట ఉమ్మితే.. ఇక అంతే సంగతులు..!

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజు రోజుకు కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల మద్య సరైన అవగాహన లేక కరోనా వ్యాప్తి జరుగుతుంది. నేరుగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తితో సంబందం లేకున్నా చాలా మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైరస్‌ సోకిన వారి నుంచి బహిరంగ ప్రాంతాల్లో అనేక వస్తువుల మీద చేరుకోవడమే. అటువంటి వస్తువులను […]

బయట ఉమ్మితే.. ఇక అంతే సంగతులు..!
Follow us

|

Updated on: May 26, 2020 | 4:39 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజు రోజుకు కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల మద్య సరైన అవగాహన లేక కరోనా వ్యాప్తి జరుగుతుంది. నేరుగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తితో సంబందం లేకున్నా చాలా మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైరస్‌ సోకిన వారి నుంచి బహిరంగ ప్రాంతాల్లో అనేక వస్తువుల మీద చేరుకోవడమే. అటువంటి వస్తువులను ఇతరులు తిరిగి ముట్టుకోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోందంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఉమ్మడం ద్వారా అనేక చోట్లకు ఆ తుంపరలు అంటుకుని ప్రయాణించడం వల్ల వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు నిపుణులు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని ప్రభుత్వం నిషేదించింది. అయినా జనాలు ఆ నిబందనలను పట్టించుకోవడం లేదు. చాలా మంది ఇప్పటికీ రోడ్లపై ఉమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల పట్ల పోలీసులు కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అటు ప్రజలకు ప్రతి రోజు ఆరోగ్య శాఖ ఉమ్మకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంది. జనంలో అవగాహన రానంత వరకూ కరోనా కట్టడి అసాధ్యమంటున్నారు నిపుణులు.