UGC NET 2026 రాసే వారికి బిగ్‌ అలర్ట్.. ముందుగా ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి!

UGC NET 2026 intimation slip Download: యూజీసీ నెట్ జూన్ 2026 సెషన్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల ఎన్టీయే విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం యూజీసీ నెట్‌ పరీక్షలు జూన్‌ 22 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాలను కేటాయించే నగరానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు..

UGC NET 2026 రాసే వారికి బిగ్‌ అలర్ట్.. ముందుగా ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి!
UGC NET Exam

Updated on: Jun 10, 2026 | 3:52 PM

హైదరాబాద్, జూన్‌ 10: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించనున్న (UGC NET) జూన్ 2026 సెషన్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల ఎన్టీయే విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం యూజీసీ నెట్‌ పరీక్షలు జూన్‌ 22 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాలను కేటాయించే నగరానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ వారంలోనే విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ స్లిప్‌లను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.

యూజీసీ నెట్ 2026 సిటి ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

షెడ్యూల్‌ ప్రకారం.. UGC NET జూన్ 2026 పరీక్షలు జూన్ 22 నుంచి జూన్ 30 ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం జరగనున్నాయి. వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో జరుగుతాయి. పరీక్ష మొత్తం 2 పేపర్లకు, 3 గంటల వ్యవధిలో ఉంటుంది. రెండు పేపర్లు ఒకేసారి రాయవల్సి ఉంటుంది. మధ్యలో ఎలాంటి బ్రేక్‌ ఉండదు. నెగటివ్ మార్కింగ్ లేదు. మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలు రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కాంప్రహెన్షన్ విభాగాల నుంచి అడుగుతారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు కేటాయిస్తారు. ఇక రెండో పేపర్‌లో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు 100 చొప్పున, 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 87 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరుగుతాయి. యూజీసీ నెట్‌ పరీక్షల కోసం దేశ వ్యాప్తంగా మొత్తం 271 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఇందులో అర్హత సాధించిన వారికి దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు అర్హత సాధించడంతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

యూజీసీ నెట్ 2026 సిటి ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సిటీ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ఉన్న city intimation slip for UGC-NET 2026 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్‌ అయిన తర్వాత అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే స్లిప్ స్క్రీన్‌పై సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

యూజీసీ నెట్ 2026 సిటి ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us