బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా? ఇదిగో కీలక షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం టీఎస్ ఈసెట్‌ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 15 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన..

బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా? ఇదిగో కీలక షెడ్యూల్‌
TS ECET Counselling

Updated on: Jun 11, 2026 | 4:49 PM

హైదరాబాద్‌, జూన్‌ 11: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్, బీఎస్‌సీ గణితం విద్యార్థులు బీటెక్, బీఫార్మసీలో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 15 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు ఈసెట్‌ ప్రవేశాల కమిటీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం రెండు విడతల్లో ఈసెట్‌ కౌన్సెలింగ్ జరగనుంది.

తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్‌ 15 నుంచి 18 వరకు స్లాట్‌ బుకింగ్ ఉంటుంది. జూన్‌ 17 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, జూన్‌ 17 నుంచి 21 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత జూన్‌ 24వ తేదీలోపు సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి విడత పూర్తయిన తర్వాత తుది విడత కౌన్సెలింగ్‌ జులై 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఈసెట్‌ 2026 కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇగ్నో 2026 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. జూలై 15 వరకే ఛాన్స్!

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై 2026 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో పోస్ట్ గ్రాడ్యూయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్‌ కె. సుమలత ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 15 వ తేదీ వరకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండో, మూడో సంవత్సరం సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా జూన్ 30వ తేదీలోపు చెల్లించాలని తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇగ్నో విజయవాడ 2026 ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us