AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పదో తరగతి పాసైతే చాలు! జాబ్‌ గ్యారెంటీ

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్స్ పోస్టులు..

TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పదో తరగతి పాసైతే చాలు! జాబ్‌ గ్యారెంటీ
TGSRTC Job Notification
Srilakshmi C
|

Updated on: Sep 20, 2025 | 5:04 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్స్ పోస్టులు 1000, శ్రామిక్‌ పోస్టులు 743 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

సంబంధిత పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025వ తేదీ నాటికి డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ఇక శ్రామిక్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ఆధారంగా అక్టోబర్‌ 28, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద డ్రైవర్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.600 చొప్పున చెల్లించాలి. ఇక శ్రామిక్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.400 చొప్పున చెల్లించాలి. ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థుల తేది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు డ్రైవర్‌ పోస్టులకైతే రూ.20,960 నుంచి రూ.60,080 వరకు, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టీజీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!