SSC JE, TGPSC పరీక్షలు ఒకే రోజు.. అభ్యర్థుల సమస్యపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

TGPSC AE/AEE Exam 2026: తెలంగాణలో టీజీపీఎస్సీ ఏఈ/ఏఈఈ పరీక్షలకు, ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్షలకు మధ్య తేదీల్లో క్లాష్ ఏర్పడింది. నవంబర్ 6న ఎస్ఎస్‌సీ జేఈ సివిల్ పరీక్ష రాయాల్సి ఉండి, టీజీపీఎస్సీ ఏఈ/ఏఈఈ సివిల్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అవసరమైన పత్రాలను సమర్పించాలి. అర్హులైన అభ్యర్థులకు నవంబర్ 7న టీజీపీఎస్సీ పరీక్ష రాసే అవకాశం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు..

SSC JE, TGPSC పరీక్షలు ఒకే రోజు.. అభ్యర్థుల సమస్యపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
TGPSC AE Exam Exam Date Changed

Edited By:

Updated on: Oct 26, 2026 | 3:41 PM

హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రోడ్లు మరియు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షల తేదీలు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే జూనియర్ ఇంజనీర్ పరీక్షల తేదీలు ఒకే రోజు రావడంతో అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. నవంబర్ 6, 7 తేదీల్లో జరగాల్సిన టీజీపీఎస్సీ ఏఈ పరీక్ష తేదీలు, నవంబర్ 2 నుంచి 6 వరకు షెడ్యూల్ చేయబడిన ఎస్సెస్సీ జూనియర్ ఇంజనీర్ పరీక్ష తేదీలతో క్లాష్ అవుతున్నట్లు అభ్యర్థులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఎస్సెస్సీ ఛైర్మన్‌తో స్వయంగా మాట్లాడి అభ్యర్థుల ఇబ్బందిని పరిష్కరించేందుకు చొరవ చూపారు.

ఈ పరీక్షల క్లాష్‌ను పరిష్కరించే క్రమంలో, ఎస్సెస్సీ జూనియర్ ఇంజనీర్ పరీక్ష తేదీ నవంబర్ 6, 2026గా కేటాయించబడి, టీజీపీఎస్సీ ఏఈ పరీక్ష కూడా అదే రోజు రావడం వల్ల నష్టపోతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. నవంబర్ 6వ తేదీన ఎస్సెస్సీ జూనియర్ ఇంజనీర్ (సివిల్) పరీక్షను కలిగి ఉండి, టీజీపీఎస్సీ ఏఈ (సివిల్) పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఎస్సెస్సీ జెఈ హాల్ టికెట్ కాపీ (నవంబర్ 6 తేది ఉన్నది), టీజీపీఎస్సీ ఏఈ నోటిఫికేషన్ అప్లికేషన్ కాపీ మరియు టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఐడీలను సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ పత్రాలను అక్టోబర్ 30, 2026 సాయంత్రం 5 గంటలలోపు టీజీపీఎస్సీ ఆఫీస్‌లోని హెల్ప్ డెస్క్ ద్వారా లేదా helpdesk@tgpsc.gov.in మెయిల్ ఐడీకి పంపాలని సూచించారు. అభ్యర్థులు ఏ ఒక్కరు కూడా మంచి అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో పరిశీలన తర్వాత సాధ్యమైనంత వరకు నవంబర్ 7, 2026న టీజీపీఎస్సీ ఏఈ పరీక్షను రాయడానికి తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు కమిషన్ అధికారికంగా వెల్లడించింది. అభ్యర్థులు గడువులోగా తమ డాక్యుమెంట్లను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us