TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈఏపీసెట్, లా సెట్, టీజీ ఈసెట్, టీజీ పీజీ ఈసెట్ వంటి పలు ప్రవేశ పరీక్షలన్నీ..

TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!
Telangana CETs Exam Dates

Updated on: Apr 25, 2026 | 4:23 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా, ఎడ్యుకేషన్ వంటి పలు ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలకు రాత పరీక్షల తేదీలను ఈ సందర్భంగా ఖరారు చేస్తూ షెడ్యూల్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు మే నెలలోనే నిర్వహించనున్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

ఏ ప్రవేశ పరీక్ష ఏ తేదీన జరగనుందంటే?

  • టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ విద్యార్ధులకు మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
  • టీజీ ఈసెట్ (TG ECET) 2026 ప్రవేశ పరీక్ష మే 15వ తేదీన జరుగుతుంది.
  • టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ (TG LAWCET & PGLCET 2026) ప్రవేశ పరీక్షలు మే 18న జరుగుతాయి.
  • టీజీ పీజీ ఈసెట్ (TG PGECET) 2026 ప్రవేశ పరీక్ష మే 28 నుంచి 31 వరకు జరుగుతాయి.
  • టీజీ పీఈసెట్ (TG PECET) 2026 ప్రవేశ పరీక్ష మే 31 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి.

ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయా సెట్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి తెలుసుకోవాలని అధికారులు సూచించారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న తప్పుడు వార్తలను చూసి మోసపోవద్దని, వెబ్‌సైట్‌లలో ఇచ్చిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us