TGSRTC Answer Key 2026: ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఆన్సర్‌ కీ విడుదల! ఫలితాలు ఎప్పుడంటే..

ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులకు మార్చి 29న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు తాజాగా విడుదల..

TGSRTC Answer Key 2026: ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఆన్సర్‌ కీ విడుదల! ఫలితాలు ఎప్పుడంటే..
TGSRTC Answer Key

Updated on: Apr 06, 2026 | 3:58 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 6: తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులకు మార్చి 29న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్ధులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలుంటే ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారపత్రాలతో సహా వెబ్‌సైట్‌లోని నిర్ణీత టెంప్లెట్‌ ద్వారా సమర్పించాలని సూచించారు.

తెలంగాణ ఆర్టీసీ రాత పరీక్ష ఆన్సర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉప్రిల్‌ 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలను తప్పనిసరిగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌ ద్వారా మాత్రమే సమర్పించవల్సి ఉంటుంది. అలాగే ప్రతి ప్రశ్నకు రూ.500 రుసుంను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్ధులు వెల్లడించిన అభ్యంతరం సరైనదిగా నిర్ధారణైతే వారు చెల్లించిన రుసుమును తిరిగి చెల్లిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్షలో ఏవైనా ప్రశ్నల్ని తొలగించాల్సి వస్తే, వాటికి సంబంధించిన మార్కులను అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా నిష్పత్తి ప్రకారం అందరికీ సమానంగా కేటాయిస్తామని పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి త్వరితగతిన ఫలితాలు కూడా వెల్లడించనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా మొత్తం 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తం పోస్టుల్లో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ (టీఎస్‌టీ) పోస్టులు, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ (ఎంఎస్‌టీ) పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో నిర్ణీత మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోండి.

తెలంగాణ ఆర్టీసీ రాత పరీక్ష ఆన్సర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us