Civils Preparation: సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసమే ఈ శుభవార్త.. పూర్తి వివరాలివే..

|

Sep 23, 2021 | 10:00 AM

Civils Preparation: మీరు సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నారా? అందుకు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? కోచింగ్ తీసుకునే స్థోమత లేదా? అయితే, మీకోసమే ఈ శుభవార్త

Civils Preparation: సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసమే ఈ శుభవార్త.. పూర్తి వివరాలివే..
Coaching
Follow us on

Civils Preparation: మీరు సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నారా? అందుకు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? కోచింగ్ తీసుకునే స్థోమత లేదా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)-2022 పరీక్షకు సన్నద్ధమయ్యే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తు అధికారిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా 9 నెలల పాటు ఆన్‌లైన్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు.. అక్టోబర్ 17వ తేదీలోగా http://studycircle.cgg.gov.in, లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే, అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించరాదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 6281766534 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

నేడు టీఎస్ఐసెట్-21 ఫలితాలు..
తెలంగాణ రాష్ట్ర ఐసెట్-21 ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ ఫలితాలను గురువారం సాయంత్రం 3 గంటలకు విడుదల చేస్తామని టీఎస్‌ ఐసెట్‌-21 కన్వీనర్‌ కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Also read:

Call Money: కాటేసిన ‘కాల్ మనీ’.. 10 వేల కోసం మహిళ ప్రాణాలు బలిగొన్న వడ్డీ వ్యాపారస్తులు..

Viral Pic: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

Crime News: శ్రీశైలం మల్లిఖార్జనుడి దర్శనం కోసం వచ్చిన దంపతులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య