TS Inter Supplementary Results 2026: విద్యార్థుల నిరీక్షణకు తెర.. మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

TS Inter Supplementary 2026 Result date and time: రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

TS Inter Supplementary Results 2026: విద్యార్థుల నిరీక్షణకు తెర.. మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
TG Inter Supplementary Results

Updated on: Jun 10, 2026 | 7:32 PM

హైదరాబాద్‌, జూన్‌ 10: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపు (జూన్‌ 11) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. గురువారం ఉదయం 11.30 గంటలకి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. నేరుగా ఆన్‌లైన్ లోనే ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేయనుంది. కాగా ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం కూడా వేగంగా ముగిసింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు జూన్‌ 10వ తేదీలోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయాలని భావించింది. సాంకేతిక సమస్యల వల్ల జూన్‌ 11న ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి మే 21 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు గరిష్ట స్థాయిలో మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది విద్యార్ధులు, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా.. సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అటు డిగ్రీ ప్రవేశాలు, ఇతర ఉన్నత విద్యా అడ్మిషన్ ప్రక్రియలు కూడా ప్రారంభం అవుతాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us