TG Govt Job Notification 2025: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. 1623 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాటి భర్తీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసిన సర్కార్.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి..

TG Govt Job Notification 2025: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. 1623 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
Telangana Health Department Jobs

Updated on: Aug 22, 2025 | 4:13 PM

హైదరాబాద్, ఆగస్ట్‌ 22: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. మొత్తం 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి శుక్రవారం (ఆగస్ట్ 22) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టు 22 ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను సెప్టెంబర్ 8వ తేదీ నుంచి స్వీకరించనుంది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉంటుంది. సర్కార్ తాజా ప్రకటనతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగు అవనున్నాయి.  అలాగే పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవనున్నాయి.  ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే పోస్టులను తెలంగాణ వైద్య విద్య విధాన పరిషత్తులోని ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత తీరుతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అంతేకాకుండా జిల్లా, ఏరియా ఆసుపత్రులతో పాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.

కాగా రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఇటీవలే 607 పోస్టులను నింపేందుకు భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. దీనితోపాటు 1 స్పీచ్ పాథాలజిస్ట్‌ పోస్టుకు నోటిఫికేషన్‌, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ నియామకాలతో వైద్య రంగంలో సేవలు మెరుగుపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us