SSB Constable Jobs 2026: పదో తరగతి, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.81,100 జీతం

సశస్త్ర సీమా బల్ (SSB) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 76 కానిస్టేబుల్‌ నాన్‌-గెజిటెడ్‌ పోస్టులైన మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టులను..

SSB Constable Jobs 2026: పదో తరగతి, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.81,100 జీతం
SSB Constable Para Medical Jobs

Updated on: Mar 25, 2026 | 8:04 AM

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (SSB).. గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 76 కానిస్టేబుల్‌ నాన్‌-గెజిటెడ్‌ పోస్టులైన మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియల్‌ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సశస్త్ర సీమాబల్‌లో కానిస్టేబుల్‌, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టుల వివరాలు

  • హెడ్ కానిస్టేబుల్ (ల్యాబొరేటరీ అసిస్టెంట్) పోస్టుల సంఖ్య: 30
  • హెడ్ కానిస్టేబుల్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్) పోస్టుల సంఖ్య: 12
  • కానిస్టేబుల్ (నర్స్ అసిస్టెంట్ కమ్ మెడిక్) పోస్టుల సంఖ్య: 34

సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ల్యాబ్, ఫిజియోథెరపీ విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఒక సంవత్సరం సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. కానిస్టేబుల్ (నర్స్ అసిస్టెంట్) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21, 2026న ప్రకటన వెలువడింది.

ఇవి కూడా చదవండి

పరీక్ష ఫీజు కింద జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us