RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఏప్రిల్‌ 6 వరకు అభ్యంతరాల స్వీకరణ! లింక్‌ ఇదే

రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ గ్రేడ్‌ 1 పోస్టుల భర్తీకి ఇటీవల ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఆర్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ షీట్లను..

RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఏప్రిల్‌ 6 వరకు అభ్యంతరాల స్వీకరణ! లింక్‌ ఇదే
RRB Technician Grade 1 Answer Key

Updated on: Mar 29, 2026 | 7:15 AM

హైదరాబాద్‌, మార్చి 29: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ గ్రేడ్‌ 1 పోస్టుల భర్తీకి ఇటీవల ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఆర్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా మార్చి 13న ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ గ్రేడ్ 1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జరిగింది. అభ్యర్థులు ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు తెలియజేసేవారు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 6 వరకు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలు స్వీకరిస్తారు. కాగా మార్చి 6, 9, 10 తేదీల్లో రైల్వే టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పరీక్షలు కూడా జరిగాయి. ఇటీవల ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల అయింది. వీటి ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌, తదితర విభాగాల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us