భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,376 పారా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి హ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.. రైల్వే రీజియన్లలో పోస్టింగ్ ఇస్తారు.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్/ జీఎన్‌ఎం/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 26, 2024 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250, ఇతరులకు రూ.500 చొప్పున చెల్లించాలి. సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ విభాగంలో 70 ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 10 ప్రశ్నలలకు 10 మార్కులు, జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల్లో 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్ సైన్స్ విభాగంలో 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున అడుగుతారు. 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.