PDIL Civil-Construction Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియ లిమిటెడ్ (PDIL).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్ కన్‌స్ట్రక్షన్ విభాగంలో 10 ఇంజనీర్ గ్రేడ్-II పోస్టుల (Civil-Construction Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్, స్ట్రక్చర్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. జులై 31, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 27, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఓబీసీ అభ్యర్ధులు రూ.400లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.46,620ల నుంచి రూ.51,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.