New Educational System: ఇక నుంచి దేశంలో డిగ్రీలు, పీజీలు ఉండవు.. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

|

May 27, 2022 | 2:46 PM

New Educational System: దేశంలో ఇప్పటికే కొత్త విద్యా విధానం ప్రారంభమైంది. విద్యారంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన..

New Educational System: ఇక నుంచి దేశంలో డిగ్రీలు, పీజీలు ఉండవు.. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Follow us on

New Educational System: దేశంలో ఇప్పటికే కొత్త విద్యా విధానం ప్రారంభమైంది. విద్యారంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యారంగంలో మొత్తం 27 రంగాల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పుడు యూజీసీ మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విద్యార్హతకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అనే సమాధానాలు వచ్చేవి. కానీ రానున్న రోజుల్లో అలా పిలవడం కుదరదు. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అని చెప్పాల్సి ఉంటుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వివిధ అర్హతల స్థాయిలను నిర్ణయించడానికి కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది.

40 క్రెడిట్‌లు సాధించినట్లయితే సర్టిఫికేట్..

టెక్నికల్ ఎడ్యుకేషన్, జనరల్ కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు వేర్వేరుగా లెవెల్స్‌ను నిర్ణయిస్తామని యూజీసీ తెలిపింది. విదేశాలకు వెళ్లినప్పుడు ఏ విద్యార్థి ఏ స్థాయి పూర్తి చేశాడో చెబితే సరిపోతుంది. ఫ్రేమ్‌వర్క్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా యూజీసీ కోరింది. యూజీసీ కూడా క్రెడిట్లను ఖరారు చేసింది. 40 క్రెడిట్‌ల సర్టిఫికేట్, 80 క్రెడిట్‌ల డిప్లొమా, 120 క్రెడిట్‌ల డిగ్రీ. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు, సాంకేతిక నైపుణ్యాలు, సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఉన్నత విద్యను ఏడు స్థాయిలుగా వర్గీకరించడానికి UGC ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. గతంలో ఆరు లెవెల్స్ ఉండగా.. తాజాగా ఏడు లెవెల్స్‌కు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించాల్సిన క్రెడిట్‌ల సంఖ్యకు ఎలాంటి మార్పులు చేయలేదు. వివిధ విద్యార్హతలకు స్థాయిలు (Levels) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ ప్రేమ్‌వర్క్‌ ముసాయిదాను విడుదల చేసింది. అయితే 40 క్రెడిట్స్‌ సాధించినట్లయితే సర్టిఫికేట్‌, 80 క్రెడిట్స్‌ సాధించినట్లయితే డిప్లొమా, 120 క్రెడిట్స్‌ సాధించినట్లయితే డిగ్రీని జారీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ నూతన విద్యా విధానం నవ భారత నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించనుంది. కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన మార్పుల్లో మొట్టమొదటిది పూర్వ ప్రాథమిక విద్య. ఇప్పటి వరకు సాగిన10+2 విద్య స్థానంలో ‘ఎన్​ఈపీ 2020’ కొత్తగా 5+3+3+4 విధానం తీసుకువచ్చింది. 3 నుంచి 8, 8 నుంచి -11, 11-నుంచి 14, 14- నుంచి18 సంవత్సరాల స్టూడెంట్స్​కొత్త విద్యా విధానం పరిధిలోకి వస్తారు. అంతర్జాతీయంగా దీన్ని కీలకమైన, పిల్లల మానసిక వికాసానికి సరైన దశ అని గుర్తించారు.

మరిన్నికెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి