NFL Recruitment: నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?

|

Oct 23, 2021 | 3:19 PM

NFL Recruitment 2021: నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) పలు యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. నోయిడాలో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ..

NFL Recruitment: నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?
Nfl Recruitment 2021
Follow us on

NFL Recruitment 2021: నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) పలు యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. నోయిడాలో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ యూనిట్లలోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 183 ఖాళీలకు గాను జూనియర్‌ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ 109, లోకో అటెండెంట్‌ 23, అటెండెంట్‌ 36, మార్కెటింగ్‌ రిప్రజంటేటివ్‌ 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ప్రొడక్షన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ఎస్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 21-10-2021 ప్రారంభంకాగా, చివరి తేదీగా 10-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amith Shah: 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ములో తొలిసారి అమిత్‎షా పర్యటన.. శ్రీనగర్‎ అభివృద్ధిపై సమీక్ష.

Blood Pressure: అధిక రక్తపోటు వేధిస్తుందా..? అయితే.. ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..

Viral News: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుంది… ప్రాణాలే కోల్పోయింది..