NExT for MBBS Students: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసా? నెగ్గలేదంటే డాక్టర్‌ కల చెదిరిపోయినట్లే..

|

Dec 04, 2022 | 5:16 PM

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ 2023 పరీక్ష తర్వాత కనుమరుగుకానున్న విషయం తెలిసిందే. దీని స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్‌ట్‌) ఆధారంగా మెడికల్ పీజీ ప్రవేశాలు కల్పించనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించే నీటీ పీజీ 2023..

NExT for MBBS Students: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసా? నెగ్గలేదంటే డాక్టర్‌ కల చెదిరిపోయినట్లే..
NExT for MBBS Students
Follow us on

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ 2023 పరీక్ష తర్వాత కనుమరుగుకానున్న విషయం తెలిసిందే. దీని స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్‌ట్‌) ఆధారంగా మెడికల్ పీజీ ప్రవేశాలు కల్పించనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించే నీటీ పీజీ 2023 పరీక్షయే చివరి పరీక్షకానున్నట్లు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఇప్పటికే స్పష్టం చేసింది. వైద్య రంగంలో కీలక మార్పుల దిశగా ఎన్‌ఎంసీ కార్యచరన రూపొందిస్తోంది. ఈ సదర్భంగా నెక్స్‌ట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష అంటే ఏమిటి? ఇది ఏ విధంగా ఉంటుంది? వంటి విషయాలు మీకోసం..

నెక్స్‌ట్‌ అంటే..

ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి జరిపే నీట్‌ పీజీ ఎంట్రన్స్, ఇక విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు మన దేశంలో ప్రాక్టీస్‌ కోసం నిర్వహించే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లకు బదులు.. ఉమ్మడిగా నెక్స్‌ట్‌ పేరుతో ఒకే పరీక్ష నిర్వహిస్తారన్నమాట. వీరితోపాటు ఎంబీబీఎస్‌ చదివిన వారు ఉన్నత విద్య చదవాలన్నా, ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్‌ వంటి వాటి కోసం కూడా వేర్వేరే పరీక్షలు నిర్వహించకుండా.. అన్నింటికీ కలిపి నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పేరున ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులు, మన దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలన్నీ, ప్రాక్టీస్‌ మొదలు పెట్టాలన్నా నెక్స్‌ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇప్పటి వరకు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన భారతీయ అభ్యర్థులు ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాసేవారు. ఇకపై ఈ పరీక్ష రద్దు అయ్యి.. దీని స్థానంలో నెక్స్‌ట్‌ ఉంటుంది.

నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

నెక్స్‌ట్‌ను నెక్స్‌ట్‌-1, నెక్స్‌ట్‌-2 అనే రెండు దశలుగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్వహించనుంది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ థియరీ పార్ట్‌ పూర్తయ్యాక నెక్స్‌ట్‌-1ను, ఆ తర్వాత ఏడాది (12 నెలలు) ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక నెక్స్‌ట్‌-2 ఉంటుంది. నెక్స్‌ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. నేషనల్‌ మెడికల్‌ రిజిస్ట్రీ/రాష్ట్రాల మెడికల్‌ రిజిస్ట్రీల్లో పేరు నమోదుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నెక్స్‌ట్‌–1లో థియరీ , నెక్స్‌ట్‌–2ను ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. ఈ రెండు పార్టులకు ఎంబీబీఎస్‌లో ఉండే మొత్తం 19 సబ్జెక్ట్‌ల నుంచి 240 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 960 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులు నెక్స్‌ట్‌–1, నెక్స్‌ట్‌–2 రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించాలి.ఈ రెండు దశల్లోనూ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే షరతు కూడా ఉంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.