Indian Air Force Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా గ్రూప్ సీ సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 197 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్మెన్ మెట్ వంటి పోస్టులున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యంతోపాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి.
* అనంతరం దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో అందించాలి.
* అభ్యర్థులను పోస్టులను అనుసరించి రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07.09.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా