Govt Jobs 2025: నిరుద్యోగులకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

India Meteorological Department Recruitment 2025 Jobs: భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలో.. మిషన్ మౌసమ్ పథకం కింద ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ సైంటిస్ట్ , సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

Govt Jobs 2025: నిరుద్యోగులకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!
India Meteorological Department Jobs

Updated on: Nov 18, 2025 | 10:16 AM

భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా మెటియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌.. మిషన్ మౌసమ్ పథకం కింద ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ సైంటిస్ట్ , సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 134 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-ఈ పోస్టుల సంఖ్య: 1
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-III పోస్టుల సంఖ్య: 13
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-II పోస్టుల సంఖ్య: 29
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-I పోస్టుల సంఖ్య: 64
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 25
  • అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 2

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీఈ/బీటెక్‌ ఉత్తర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ఉద్యోగానుభవం కూడా ఉండాలి. పీహెచ్‌డీ, ఎంటెక్‌, ఎంఈ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-ఈ పోస్టులకు 50 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- పోస్టులకు 45 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్టులకు 35 ఏళ్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 30 ఏళ్ల వయసు మించకూడదు. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 14, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 24, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి.

స్క్రీనింగ్‌, విద్యార్హతలు, అనుభవం, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-ఈ పోస్టులకు రూ.1,23,100, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-III పోస్టులకు రూ.78,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్టులకు రూ.67,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్టులకు రూ.56,000, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.29,200 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.