CSIR – SERC Recruitment 2022: బీటెక్ నిరుద్యోగులకు బంపరాఫర్.. స్టక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్‌లో రీసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్ - స్టక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (CSIR - SERC).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన..
CSIR – SERC Chennai Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్ – స్టక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (CSIR – SERC).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: గేట్ అభ్యర్ధులకు నెలకు రూ. 31,000లతోపాటు హెచ్‌ఆర్‌ఏ, నాన్ గేట్ అభ్యర్ధులకు నెలకు రూ.25,000లతోపాటు హెచ్‌ఆర్‌ఏను జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీఈ, ఎంఈ/ఎంటెక్, ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.
అడ్రస్: సీఎస్‌ఐఆర్ – ఎస్‌ఈఆర్‌సీ, సీఎస్‌ఐఆర్ రోడ్, తారామణి, చెన్సై 600113.
ఇంటర్వ్యూ తేదీ: మే 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.