C-DAC Recruitment 2022: బీటెక్‌ అర్హతగల ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగావున్న 650 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజుతో ముగుస్తున్న..

|

Jul 20, 2022 | 9:01 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. హైదరాబాద్‌తోసహా పలు సీడ్యాక్‌ కేంద్రాల్లో పనిచేయడానికి ప్రాజెక్ట్‌ అసోసియేట్ (Project Associate Posts) పోస్టులకు దరఖాస్తు..

C-DAC Recruitment 2022: బీటెక్‌ అర్హతగల ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగావున్న 650 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజుతో ముగుస్తున్న..
Cdac
Follow us on

C-DAC Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. హైదరాబాద్‌తోసహా పలు సీడ్యాక్‌ కేంద్రాల్లో పనిచేయడానికి ప్రాజెక్ట్‌ అసోసియేట్ (Project Associate Posts) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 650

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్ ఇంజినీర్ పోస్టులు: 50
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు: 400
  • ప్రాజెక్ట్‌ మేనేజర్ పోస్టులు: 50
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు: 150

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీలు: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.