
ఒక వ్యక్తి 19235లో పుట్టి, 1925లోనే చనిపోయాడు. అయినప్పటికీ మరణించే సమయానికి అతని వయస్సు 70 ఏళ్లు.. అంటే ఈ ప్రశ్నలో ఉన్న వ్యక్తి ‘1925లో పుట్టాడు’, అలాగే ‘1925లో చనిపోయాడు’ అనే వాక్యాలను మనం సహజంగా సంవత్సరంగా భావిస్తాం. కానీ అక్కడ 1925 అనేది ఒక సంఖ్య మాత్రమే. దానిని సంవత్సరంగా అర్థం చేసుకోవడం వల్లే గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రశ్నలను IAS, UPSC వంటి పోటీ పరీక్షల ఇంటర్వ్యూలలో అభ్యర్థుల తార్కిక ఆలోచన, పరిశీలనా శక్తి, ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటారో పరీక్షించడానికి అడుగుతుంటారు. సరైన సమాధానం తెలుసుకోవడానికి ప్రశ్నలోని ప్రతి పదాన్ని జాగ్రత్తగా విశ్లేషించాలి.
ఇక్కడ ఇచ్చిన 1925 అనేది సంవత్సరం కాదు.. అది ఒక గది నంబర్ లేదా ఇంటి నంబర్ లేదా ఆసుపత్రి గది నెంబర్ కూడా కావచ్చు. ఆ వ్యక్తి 1925 నంబర్ గదిలో జన్మించాడు. జీవితాంతం జీవించిన తర్వాత 70 సంవత్సరాల వయస్సులో మళ్లీ అదే 1925 నంబర్ గదిలో మరణించాడు. అంటే 1925 అనేది సంవత్సరం కాదు. అది గది లేద ఇంటి నంబర్ అన్నమాట. అందువల్ల ఆ వ్యక్తి 70 ఏళ్లు జీవించి 1925 నంబర్ గదిలోనే జన్మించి అదే నంబర్ గదిలో మరణించాడు. కాబట్టి అతని వయస్సు 70 సంవత్సరాలు కావడంలో ఈ ప్రశ్నలో ఎలాంటి విరుద్ధత లేదు.
1925 అనే సంఖ్యను చూసి చాలా మంది దాన్ని సంవత్సరం అని భావిస్తారు. అలా భావిస్తే ఒకే సంవత్సరంలో పుట్టి చనిపోయి 70 ఏళ్లు జీవించడం అసాధ్యం. కానీ ప్రశ్నలో 1925 అనేది సంవత్సరం అని ఎక్కడా చెప్పలేదు. అది ఒక ఇంటి నంబర్, గది నంబర్ లేదా ఆసుపత్రి గది నంబర్ కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తి 70 ఏళ్లు జీవించి 1925 నంబర్ గదిలోనే మరణించాడని అర్థం. ఇంటర్వ్యూ లేదా ఎగ్జాంలలోనూ ఇలాంటి తార్కిక ప్రశ్నలు అడుగుతారు. ఇటువంటి ప్రశ్నలను జాగ్రత్తగా చదివి ఆన్సర్ ఇవ్వాలేగానీ.. అందులో చెప్పని విషయాలను ఊహించకూడదు. ఈ ట్రిక్కీ క్వశ్చన్‌ను మీ ఫ్రెండ్స్‌ను సరదాగా అడిగి చూడండి. ఎంత మంది ఆన్సర్ కరెక్ట్‌గా చెబుతారో చూద్దాం..