BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Bharat Petroleum Corporation Limited

Updated on: Jul 21, 2022 | 6:40 AM

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌), జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అకౌంట్స్‌) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30-32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇవి కూడా చదవండి

* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అకౌంట్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కేస్‌ బేస్డ్‌ డిస్కషన్‌, గ్రూప్ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అకౌంట్స్‌) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 23-07-2022న మొదలవుతుండగా, 08-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us