AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Forest Beat Officer Jobs 2026: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ ఫారెస్ట్‌ సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌లో 23 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్‌ 16, 2026 నుంచి దరఖాస్తు..

APPSC Forest Beat Officer Jobs 2026: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
APPSC Forest Beat Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 18, 2026 | 1:32 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ ఫారెస్ట్‌ సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌లో 23 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్‌ 16, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉండదు. సింగిల్‌ లెవెల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షతో పాటు వాకింగ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 23 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (FBO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పోస్టుకు నిర్దేశించిన శారీరక అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో వాకింగ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉండటంతో అభ్యర్థులు సంబంధిత ఫిజికల్‌ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు సింగిల్‌ లెవెల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (CBRT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉండదు. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఇంటర్మీడియట్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ పోస్టులు ఉపయోగకరమైన అవకాశం. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌, వాకింగ్‌ టెస్ట్‌ నిబంధనలు, దరఖాస్తు రుసుము, సిలబస్‌ తదితర పూర్తి వివరాలను అధికారిక APPSC నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ & మెంటల్‌ ఎబిలిటీ 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 2లో జనరల్‌ సైన్స్‌, జనరల్‌ మ్యాథమెటిక్స్‌ (SSC స్థాయి) నుంచి 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. అదనంగా ఇంగ్లిష్‌, తెలుగు లేదా ఉర్దూలో వ్యాస రచనకు క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 45 నిమిషాల వ్యవధిలో 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు చొప్పున కోత విధిస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాధానాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..