AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGCAB Bank Jobs 2025: తెలంగాణ సహాకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే చాన్స్..

Telangana State Cooperative Apex Bank Recruitment Application window close today: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ బ్రాంచుల్లో ఉద్యోగాల భర్తీకి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు జిల్లా సహాకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజుతో ఆఖరి గడువు ముగుస్తుంది..

TGCAB Bank Jobs 2025: తెలంగాణ సహాకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే చాన్స్..
Telangana State Cooperative Apex Bank Application Last Date
Srilakshmi C
|

Updated on: Nov 06, 2025 | 7:20 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 6: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాల భర్తీకి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు జిల్లా సహాకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజుతో ఆఖరి గడువు ముగుస్తుంది. పలు జిల్లాల్లోని కో-ఆపరేటీవ్‌ బ్యాంకుల్లో మొత్తం 225 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నవంబర్‌ 6, 2025వ తేదీ ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఇంగ్లిష్ భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (హైదరాబాద్‌) పోస్టుల సంఖ్య: 32
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (కరీంనగర్‌) పోస్టుల సంఖ్య: 43
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (ఖమ్మం) పోస్టుల సంఖ్య: 99
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (మహబూబ్‌నగర్‌) పోస్టుల సంఖ్య: 09
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (మెదక్‌) పోస్టుల సంఖ్య: 21
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ (వరంగల్‌) పోస్టుల సంఖ్య: 21

తెలంగాణ రాష్ట్ర స్థానికులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్‌ 1,2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

తెలంగాణ సహాకార బ్యాంకుల్లో 225 ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..