JEE Topper Kalpit Veerwal: జేఈఈ మెయిన్‌లో 360/360 మార్కులతో ‘కల్పిత్’ సంచలనం.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో అంతా తలకిందులు!

India's first 360/360 JEE topper ditched corporate life for singing: 2017 ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కల్పిత్ వీర్వాల్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్‌ కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడమే కాకుండా మునుపెన్నడూ ఎవరూ చేయలేని మరో పని కూడా చేశాడు. అదే జేఈఈ మెయిన్‌లో 360కి 360 మార్కులు సాధించడం. దీంతో అతడు రాత్రికి రాత్రే సూపర్ హీరో అయిపోయాడు..

JEE Topper Kalpit Veerwal: జేఈఈ మెయిన్‌లో 360/360 మార్కులతో కల్పిత్ సంచలనం.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో అంతా తలకిందులు!
JEE Main AIR 1 Topper Kalpit Veerwal

Updated on: Apr 06, 2026 | 8:42 PM

యేటా జేఈఈ మెయిన్‌ టాపర్లు వార్తల్లో నిలుస్తుంటారు. కానీ కొన్ని ఫలితాలు వాస్తవానికి భిన్నంగా ఉంటాయి. అవి ఇతరుల జీవితాలపై కూడా చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వారిలో 2017 ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కల్పిత్ వీర్వాల్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్‌ కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడమే కాకుండా మునుపెన్నడూ ఎవరూ చేయలేని మరో పని కూడా చేశాడు. అదే జేఈఈ మెయిన్‌లో 360కి 360 మార్కులు సాధించడం. దీంతో అతడు రాత్రికి రాత్రే సూపర్ హీరో అయిపోయాడు. ఒక సాధారణ హైస్కూల్ విద్యార్థి నుంచి జాతీయ సంచలనంగా మారాడు. దిన పత్రిలకల్లో ‘పర్ఫెక్ట్ స్కోరర్’ శీర్షికల పేరిట ఆకాశానికి ఎత్తేశాయి. కోచింగ్ సంస్థలు అతడిని ఒక గొప్ప విజేతగా కీర్తించాయి. అతని కార్పొరేట్‌ భవిష్యత్తు అప్పటికే ఖరారైపోయిందని అందరూ భావించారు. చివరికి అతడు సాధించిన టాప్‌ ర్యాంకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించిపెట్టింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కల్పిత్ వీర్వాల్ ఊహించని షాకిచ్చాడు. టాప్‌ ఐఐటీ కాలేజీలో చేరి కార్పొరేట్ కెరీర్‌ అనుసరించడానికి బదులుగా, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఐఐటీ తర్వాత అతని ప్రయాణం ఒక బిరుదును వెంబడించడం కన్నా, తనకు నిజంగా ఆసక్తి కలిగించేది ఏమిటో కనుక్కోవడం వైపు మళ్లాడు.

జీవితాన్ని మార్చేసిన ఆ రోజు ..

తొమ్మిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున 2017 ఏప్రిల్ 2వ తేదీన కల్పిత్ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చిన క్షణంగా నిలిచిపోయింది. ఆ క్షణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఇదే రోజున (2 ఏప్రిల్ 2017న) నేను నా జేఈఈ పరీక్ష రాశాను. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. నేను 360కి 360 పర్ఫెక్ట్ స్కోర్ సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాను. ఆ రోజు నాకు మాత్రం మామూలుగానే అనిపించింది. కానీ అది నా జీవితాన్ని మార్చేసింది. నేను ఒక సాధారణ హైస్కూల్ విద్యార్థి నుంచి రాత్రికి రాత్రే జాతీయ వార్తల్లోకి ఎక్కాను. తన ర్యాంక్ వల్ల తనకు లభించిన గుర్తింపు, కేవలం ఇంజనీరింగ్‌కే పరిమితం కాకుండా అనేక అవకాశాలను తెచ్చిపెట్టిందని కూడా అతను పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

కార్పొరేట్ కెరీర్‌ తనకు ఇష్టం లేదని కల్పిత్ ఈ పోస్టులో స్పష్టం చేశాడు. కార్పొరేట్ ఐఐటి మార్గం నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు. నా ర్యాంక్ కారణంగా నేను పొందిన ప్రజాదరణ ఎన్నో విభిన్న వృత్తులను చేపట్టడానికి నాకు సహాయపడింది. ఒకే మార్గానికి కట్టుబడి ఉండకుండా, కాలక్రమేణా విభిన్న రంగాలను అన్వేషించాను. వాటిలో టీచింగ్‌, వ్యాపారాలు ప్రారంభించడం, బహిరంగ ప్రసంగాలు చేయడం, కంటెంట్ సృష్టికర్తగా, యాత్రికుడిగా, చివరికి పెట్టుబడులు పెట్టడం కూడా ఉన్నాయి. ఇటీవల సింగర్, గేయ రచయితగా తన సొంత మ్యూజిక్‌ ఆల్బమ్‌ను విడుదల చేశాడు. ఇటువంటి ర్యాంకు వచ్చిన వ్యక్తి జీవితం అందరూ ఆశించిన విధంగా ఒకే సరళ రేఖలో సాగలేదు. ఈ మార్పు అసాధారణంగా అనిపించవచ్చు. కానీ కల్పిత్‌ ఎంపికలు విభిన్నమైన దృక్పథాన్ని ప్రతిబింబించాయి. ప్రస్తుతం కల్పిత్‌ సింగర్‌గా, గేయరచయితగా మరిన్ని పాటలు విడుదల చేయాలని భావిస్తున్నాడు. చివర్లో.. నా ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది కేవలం నా కథ మాత్రమే కాదు. అనేక విధాలుగా మనందరి కథ.. అని రాసుకొచ్చాడు. ఇక కల్పిత్‌ పోస్టుకు నెటిజన్‌లు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు.

ఐఐటీ టాపర్ల గురించిన మూస ధోరణులను బద్దలు కొట్టినందుకు కొందరు అతన్ని ప్రశంసించగా, సాంప్రదాయ వృత్తులకు అతీతంగా అన్వేషించాలనుకునే విద్యార్థులకు అతని మార్గం స్ఫూర్తిదాయకమని మరికొందరు భావించారు. విభిన్న రంగాల్లో ప్రయోగాలు చేయడం, కార్పొరేట్ హోదాలకు అతీతంగా కొత్తగా ప్రయత్నించడానికి అతడు చూపిన ధైర్యాన్ని అందరూ తెగ పొగిడేస్తున్నారు. విజయం నిర్వచనాన్ని పునర్నిర్వచించడం వంటి విషయాలలో కల్పిత్‌ చూపిన నిజాయితీ, తెగువ నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. లక్షలాది మంది విద్యార్థులు కలలు కనేదాన్ని అతను సాధించాడు. అయితే కెరీర్ ఎంపికలు ఎల్లప్పుడూ వ్యక్తిగతమైనవే. అందరూ ఒకే మార్గాన్ని అనేసరించాల్సిన అవసరం లేదు. అయినా సంప్రదాయాల కన్నా జిజ్ఞాసకే ప్రాధాన్యత ఇచ్చిన కల్పిత్ స్టోరీ ఈ తరానికి ఓ మైలురాయి లాంటిది.

కాగా జేఈఈలో విజయం తర్వాత కల్పిత్ వీర్వాల్ ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. అక్కడ చదువుతో పాటు ఇతర రంగాలలో కూడా కల్పిత్‌ చురుకుగా పాల్గొనేవాడు. అంతేకాదు జేఈఈ అభ్యర్థులకు ప్రిపరేషన్ వ్యూహాలు, మార్గదర్శకత్వం కోసం పలు కార్యక్రమాలను సైతం నిర్వహించాడు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us