SIP Investment: ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట.. నిపుణుల సూచనలు ఏంటంటే..?

|

Aug 04, 2024 | 5:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారాయి. గతంలో పెట్టుబడికి నమ్మకమైన రాబడి కోరుకుని చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు.  ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో రిటైల్ పెట్టుబడిదారులు నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీల ద్వారా పెట్టుబడి పెడుతున్నారు.

SIP Investment: ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట.. నిపుణుల సూచనలు ఏంటంటే..?
Investment Tips
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారాయి. గతంలో పెట్టుబడికి నమ్మకమైన రాబడి కోరుకుని చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు.  ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో రిటైల్ పెట్టుబడిదారులు నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీల ద్వారా పెట్టుబడి పెడుతున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ రూ. 5,000 ఎస్ఐపీ పెట్టుబడిలో 26 ఏళ్లలో కోటీశ్వరులను చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఈ ఏడాది జూన్‌లో నెలవారీ ఎస్ఐపీల్లో పెట్టుబడి మొత్తం రూ.21,262 కోట్లకు చేరిందంటే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలను ప్రజలు ఏ స్థాయిలో ఆధరిస్తున్నారో? మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన మ్యూచువల్ ఫండ్స్ 40-90 శాతం శ్రేణిలో వార్షిక రాబడిని ఇచ్చాయి. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది కాలంలో 41.63 శాతం రాబడిని అందించగా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్‌యు ఈక్విటీ ఫండ్ పీఎస్యూ ఒక సంవత్సరంలో 89.52 శాతం లాభాలను ఇచ్చింది. అలాగే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (38.5 శాతం లాభాలు), నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (55.58 శాతం), ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్ (28.27 శాతం), కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ (45.21 శాతం), యాక్సిస్ మిడ్‌క్యాప్ వంటి ఇతర ప్రముఖ మ్యూచువల్ ఫండ్‌లు ఫండ్ (46.48 శాతం) కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడిని అందించాయి. ఇటీవల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను బట్టి చూస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో 12-13 శాతం దీర్ఘకాలిక రాబడి సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

రూ. 5 వేల పెట్టుబడితో రాబడి ఇలా

దీర్ఘకాలిక ఎస్ఐపీ పెట్టుబడులపై సగటు రాబడిగా 12 శాతంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు 26 సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీ మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 15.6 లక్షలు అవుతుంది. మీ పెట్టుబడిపై అంచనా వేసిన రాబడి 12 శాతం వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 91.96 లక్షలు అవుతుంది. పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 15.6 లక్షలు, రూ. 91.96 లక్షల రిటర్న్ ద్వారా రూ. 1.07 కోట్లు రాబడి వస్తుంది. అయితే మీరు రూ. 15.6 లక్షలను లంప్సమ్‌లో పెట్టుబడి పెడితే 2050లో మీ మొత్తం సంపద రూ. 2.97 కోట్లుగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మ‌రిన్ని బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…