House Construction Tips: గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?

Updated on: Oct 08, 2026 | 11:33 AM

ఇళ్లు దృడంగా ఉండాలంటే నాణ్యమైన సీకులు, సిమెంట్‌తో పాటు నాణ్యమైన ఇటుకలు కూడా కావాలి. ఇంటి నిర్మాణంలో ఇటుకలు ఎంతో కీలకమైనవి.. అయితే చాలా మంది ఇంటి గోడలు నిర్మించే ముందు ఇటుకలను నీటిలో నానబెట్టడం మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఇలా ఎందుకు వాటిని నీటితో తడుపుతారని మీరెప్పుడైనా ఆలోచించారా? పొడి ఇటుకలతో గోడ కట్టడం సాధ్యం కాదా?.. అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి.. ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా ఇటనుకను మట్టితో తయారు చేసి ఎండబెడతారు. తర్వాత వాటిని బట్టీలో వేసి కాల్చుతారు. ఇలా కాల్చిన తర్వాత ఇటుకలోపల కొన్ని చిన్న చిన్న రంధ్రాలు, ఖాళీలు ఏర్పడుతాయి. ఒక వేళ ఈ ఇటుకలను నీటిలో నానబెట్టకుండా గోడను కట్టేందుకు ప్రయత్నిస్తే.. ఈ ఇటుకలోని రంద్రాలు.. గోడకట్టేందుకు వాడే సిమెంట్ మిశ్రమంలోని నీటిని పీల్చుకుంటాయి. దీని వల్ల గోడ దృడత్వం దెబ్బతింటుంది.

2 / 5
ఎందుకంటే.. గోడ కట్టేందుకు వాడే సిమెంట్ మిశ్రమం.. రెండు ఇటుకల మధ్య గట్టిగా అత్తుకొని దృడంగా ఉండాలంటే వాటికి కచ్చితంగా నీరు అవసరం అవుతుంది. సిమెంట్, నీటి మధ్య జరిగే రసాయన చర్యే ఈ గోడను బలంగా ఉంచుతుంది. ఈ సందర్భంగా మీరు పొడి ఇటుకను సిమెంట్ మిశ్రమంపై పెడితే.. అది అందులోని పూర్తి నీటిని పీల్చుకొని.. సిమెంట్‌ మిశ్రమంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల సిమెంట్ అనే సరిగ్గా గట్టిపడకుండా.. గోడ బలహీనంగా మారే ఛాన్స్ ఉంది. అందుకే ఇటుకలను నీటిలో నానబెట్టిన తర్వాత గోడ కడతారు.

3 / 5
ఇలా ఇటుకలను నీటిలో నానబెట్టినప్పుడూ.. అందులో ఖాళీగా ఉన్న రంద్రాలు నీటితో నిండిపోతాయి. దీని వల్ల ఇటుకను సిమెంట్‌ మిశ్రమంపై ఉంచినప్పుడూ అందులోని రంద్రాలు అప్పటికే నీటితో నిండి ఉంటాయి. కాబట్టి సిమెంట్‌ మిశ్రమంలోని నీటిని అది పీల్చుకోదు. దీంతో సిమెంట్ ఇటుక మధ్య దృడత్వం ఏర్పడి.. గోడ బలంగా నిలుస్తుంది.

4 / 5
అయితే ఇక్కడ చాలా మందకి మరో డౌట్‌ రావచ్చు.. మరి ఇటుకను ఎంత సమయం నీటిలో నానబెట్టాలి అని.. అయితే ఇది  ఇటుక నాణ్యత, దాని నీటిని పీల్చుకునే సామర్థ్యంపై ఆదారపడి ఉంటుంది.. కొన్ని రకాల ఇటుకలకు వేర్వేరు నీటి శోషణ సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి మొదట మీరు వాడే ఇటు రకం ఏదో తెలుసుకొని.. దాన్ని నీటిలో నానబెట్టాలా లేదా అనేది మేస్త్రీ సహాయంతో తెలుసుకోవాలి.

5 / 5
అంతేకాదు.. మీరు బట్టి నుంచి ఇటుకలను కొనుగోలు చేసినప్పుడూ.. ఆ బట్టి వారు కూడా దాన్ని ఎలా వాడాలో మీరు వివరిస్తారు. వాళ్లు చెప్పిన విషయాలను మీరు శ్రద్దగా విని.. వాటిని ఎంత సమయం నీటిలో నానబెట్టాలో తెలుసుకోండి. అయితే ఇటుకలను మీర ఎక్కవ సమయం కూడా నీటిలో నానబెట్టవద్దు.. ఇటుకలో నీటి శాతం మరీ ఎక్కవైతే వాటి మధ్యన ఉండే సిమెంట్ మిశ్రమం పలచగా మారి దృడత్వం కోల్పోవచ్చు. కాబట్టి దీనిపై పూర్తిగా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Loading...
Unable to load recommendations.
Follow Us