AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..?

ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ తమ కస్టమర్ల కోసం మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. అదే బిల్ పేమెంట్స్. ఇక నుంచి మీరు వాట్సప్‌లోనే యుటిలిటీ బిల్లులు చెల్లించవచ్చు. ఇతర యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్ ద్వారా గ్యాస్, విద్యుత్, వాటర్ బిల్లులు చెల్లించవచ్చు.

Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..?
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Sep 06, 2026 | 12:48 PM

Share

వాట్సప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలతో డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇతరుల నుంచి మీరు డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ తమ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా బిల్ పేమెంట్స్ ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చింది. తాజాగా ఈ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా మీరు సులభంగా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు.

వాట్సప్‌లోనే బిల్లులు చెల్లించవచ్చు..

ఇప్పటివరకు యుటిలిటీ బిల్లులు చెల్లించాలంటే మీరు వివిధ ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లేవారు. కానీ ఇప్పటినుంచి మీరు వాట్సప్‌లోనే బిల్లులు చెల్లించవచ్చు. దీని వల్ల వేరే ఫ్లాట్‌ఫామ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ కనెక్ట్ నెట్ వర్క్ ద్వారా పేమెంట్స్ వ్యవస్థ పనిచేస్తుంది. దీని ద్వారా లోన్ ఈఎంఐలు, కరెంట్, ఎల్పీజీ, బ్రాడ్‌బ్యాండ్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డు, వాటర్ బిల్లులు లాంటివి చెల్లించవచ్చు. దాదాపు 30కిపైగా కేటగిరీలలోని 22,700కిపైగా బిల్లులుదారులకు చెల్లింపులు చేయవచ్చు. వాట్సప్ బిల్ పేమెంట్స్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. మీరు ఒకసారి బిల్లు చెల్లిస్తే ఆటో ఫెచ్ విధానం ద్వారా గతంలో చెల్లించిన బిల్లులు స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. దీంతో వల్ల ఒకే ట్యాప్‌తో చెల్లింపులు చేయవచ్చు. ఇక వినియోగదారులు ఒకే విద్యుత్ లేదా నీటి సరఫరాదారు కింద ఉన్న తమ ఇల్లు, కార్యాలయం లేదా ఇతర కుటుంబ సభ్యుల బిల్లులను ఒకే చోట నుండి నిర్వహించుకోవచ్చు. అలాగే వివిధ ఆప్షన్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

వాట్సప్‌ ద్వారా బిల్లులు చెల్లించడం ఎలా..?

-వాట్సప్‌లో హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉండే రూపాయి ఐకాన్‌పై క్లిక్ చేయండి

-బిల్లు కేటగిరీ, సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి

-మీ ఖాతా వివరాలు నమోదు చేయండి

-యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయండి

Follow Us