AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం రూల్స్..

ఆధార్ కార్డు ఫొటోలో ఫొటోను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చా? ఆన్లైన్‌లో మార్చుకోవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించి యూఐడీఏఐ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ నిబంధనలు ఎలా ఉన్నాయంటే..

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం రూల్స్..
Aadhaar Card Update
Venkatrao Lella
|

Updated on: Aug 27, 2026 | 7:45 AM

Share

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ది పొందాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మీ పిల్లలను స్కూల్‌లో చేర్పించాలన్నా.. ఇలా ఏ పనికైనా ముందుగా ఆధార్ కార్డు అడుగుతారు. అయితే కొంతమంది ఆధార్ కార్డుల్లో ఫొటో సరిగ్గా ఉండదు. ఎప్పుడో ఆధార్ కార్డు తీసుకున్నప్పటి ఫొటో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దీంతో మీ మొఖం రూపం కూడా మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న ఫొటోతో చూసి ప్రస్తుత మనిషిని గుర్తించడంలో సమస్యలు ఎదురవుతాయి.

ఉచితంగా ఆధార్ ఫొటో అప్డేట్ చేసుకోవచ్చా..?

ఇక కొంతమంది ఆధార్ కార్డుల్లో ఫొటో సరిగ్గా ఉండదు. ఫొటో స్పష్టంగా కనిపించదు. ఇలాంటి సమయంలో ఫొటోను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులోని ఫొటోను మార్చుకోవచ్చా అనే సందేహాం చాలామందిలో ఉంటుంది. అయితే ఫొటోను మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. ఈ కార్డులో ఫొటోను ఎన్నిసార్లు మార్చుకోవచ్చనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు ఫొటోను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మీకు నచ్చినన్నీ సార్లు మార్చుకునే అవకాశం నిబంధనల ప్రకారం ఉంది. అయితే ఆన్‌లైన్ ద్వారా ఫొటో మార్చుకునే అవకాశం లేదు. ఇందుకోసం మీరు తప్పనిసరిగ్గా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంతమొత్తం రుసుం కూడా చెల్లించాలి. ప్రస్తుతం ఉచితంగా ఫొటోను అప్డేట్ చేసుకునే సౌకర్యం అందుబాటులో లేదు.

ఫీజు ఎంతంటే..?

మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ అప్డేట్ ఫారం నింపాలి. అనంతరం మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కెమెరాను ఉపయోగించి కొత్త ఫొటో తీస్తారు. ఆ ఫొటో ఆధార్ కార్డుపై కనిపిస్తుంది. ఇందుకోసం రూ.125 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని రోజుల్లో మీ ఆధార్ కొత్త ఫొటోతో అప్డేట్ అవుతుంది. అనంతరం మీరు కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటికి పోస్టాఫీస్ ద్వారా కొత్త ఆధార్ కార్డు వస్తుంది. మీరు దీనిని ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు. ఫొటోను అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేపపోతే కేవైసీ విషయంలో సమస్యలు ఎదురుకావొచ్చు. దీంతో వయస్సు పెరిగే కొద్ద ఫొటోను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.

Follow Us
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష