
Electric Scooter: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మరింత పెరిగింది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రవేశపెట్టిన టీవీఎస్ ఐక్యూబ్, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ప్రస్తుతం, ఈ స్కూటర్లు టెక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. అలాగే నగర ట్రాఫిక్‌కు ఉత్తమ వాహనంగా గుర్తింపు పొందాయి. కొత్త ఫీచర్లు, మంచి రేంజ్, భద్రత పరంగా ట్రాఫిక్‌కు అనువైన ఐక్యూబ్‌ను 2026లో మరిన్ని ఆవిష్కరణలతో ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.2 kWh నుండి 5.3 kWh వరకు బ్యాటరీ ఆప్షన్ ఉంది. ఇది వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ మొత్తం మూడు మోడళ్లను విడుదల చేసింది. ఇందులో iQube, iQube S, iQube ST అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. మరి వీటిలో ఏది ఉత్తమమైనది? ఫీచర్లు, ధర, మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం.. ఇక్కడ, బేస్ మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకు లభిస్తుంది, ఐక్యూబ్ ఎస్ స్కూటర్ మధ్య స్థాయిది మరియు ఐక్యూబ్ ఎస్టి అత్యధిక బ్యాటరీ సామర్థ్యం మరియు అత్యాధునిక సాంకేతికతతో కూడిన టాప్ వేరియంట్.
ఇది కూడా చదవండి: Credit Card: ఈ క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
బేస్ ఐక్యూబ్ మూడు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh. వీటి డిజైన్, వాడకం దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వీటి మధ్య ఉన్న ఏకైక తేడా రన్నింగ్, ఛార్జింగ్ సమయంలో మాత్రమే. 2.2 kWh బ్యాటరీ ఉన్న వాహనం 94 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీనిని 0-80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 45 నిమిషాలు పడుతుంది. 3.1 kWh ఆప్షన్ ఉన్న స్కూటర్ 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల 3 నిమిషాలు పడుతుంది. 3.5 kWh వెర్షన్ 145 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. అయితే, దీనిని 0-80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల 40 నిమిషాలు పడుతుంది.
TVS iQube ST పెద్ద 5.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 212 కిలోమీటర్ల IDC రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ వాహనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గంటకు 82 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వాహనం నగర ప్రయాణానికి, చిన్న హైవే ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 3 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
బ్యాటరీ మినహా, పనితీరు ఒకేలా ఉంటుంది. iQube సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు LED లైటింగ్, ఎకో మోడ్, పవర్ మోడ్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ మొదలైన ఫీచర్లతో వస్తాయి. iQube STలో 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇందులో వాయిస్ అసిస్ట్, TPMS కూడా ఉన్నాయి. USB ఛార్జింగ్ సిస్టమ్ కూడా అందించింది.
ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 1.13 లక్షల నుండి రూ. 1.72 లక్షల వరకు అందుబాటులో ఉంది. అయితే, ఈ ధరలు వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఆన్-రోడ్ ధర రూ. 1.24 లక్షల నుండి రూ. 1.78 లక్షల వరకు అందుబాటులో ఉంది. అయితే, ప్రభుత్వ సబ్సిడీ అందుబాటులో ఉంటే, ధర కొద్దిగా తగ్గుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Home Loan: మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్ లోన్ పొందడానికి ఎంత జీతం ఉండాలి? EMI ఎంత ఉంటుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి